May 1, 2026
Explore
సాయుధ దళాల పరేడ్‌ను సమీక్షచించిన జిల్లా ఎస్పీ

సాయుధ దళాల పరేడ్‌ను సమీక్షచించిన జిల్లా ఎస్పీ

May 1, 2026 | Andhra Pradesh

  • జిల్లా పోలీస్ వ్యవస్థలొ ఏఆర్ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది.
  • సిబ్బంది ఆరోగ్యం మరియు సంక్షేమoపై ప్రత్యేక దృష్టి.
  • గ్రీవెన్స్ సెల్ ద్వారా సిబ్బంది సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గాలు.
  • విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని స్పష్టమైన ఆదేశాలు.

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఈరోజు సాయుధ దళ పోలీసులకు గ్రీవెన్స్ సెల్ (దర్బార్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారి పరేడ్‌ను తిలకించి, పనితీరు సమీక్షించారు.

అనంతరం నిర్వహించిన గ్రీవెన్స్ సమావేశంలో పోలీస్ సిబ్బందితో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకుని తక్షణమె పరిష్కరించాలని సదరు అధికారులను ఆదేశించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో ఏఆర్ విభాగం జిల్లాకు వెన్నుముక్క లాంటిదని, క్రమశిక్షణతో పనిచేస్టారు అని తెలిపారు.
మెడికల్ పరంగా ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల ద్వారా తెలియజేయాలని, పోలీస్ శాఖ సిబ్బంది సంక్షేమం విషయంలో ఎప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు.

రాబోయే కాలంలో కూడా ఇదే క్రమశిక్షణను కొనసాగించాలని, ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మరోసారి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు , (పరిపాలన), శ్రీనివాసరావు , (సాయుధ దళం), డిఎస్పి చంద్రశేఖర్ ,ఏఓ సురేష్ కుమార్ మరియు ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags: District SP Reviews Armed Forces Parade