April 29, 2026
Explore
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం

April 29, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో ప్రమాణం చేయించిన సీఎం చంద్రబాబు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్.

పాత-కొత్త కలయికతో కమిటీలను ఏర్పాటు చేసిన టీడీపీ అధినాయకత్వం.

పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల, క్లస్టర్ స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు కల్పించిన చంద్రబాబు, లోకేష్.

కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని నిజం చేస్తూ పని చేసిన వారికే కమిటీల్లో పెద్ద పీట.

44 ఏళ్ల తర్వాత కూడా పార్టీకి ఫ్రెష్ లుక్ వచ్చేలా కమిటీలను నియామకం చేపట్టిన టీడీపీ హైకమాండ్.

సీనియర్ల సారధ్యం… జూనియర్ల దూకుడును సమపాళ్లల్లో కలుపుతూ కమిటీల నియామకం.

కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో హైలెట్ గా నిలిచిన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్, గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి.

గతంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా పని చేసిన వారికి కమిటీలో చోటు.

ఎన్టీఆర్, చంద్రబాబు పార్టీ అధ్యక్షులుగా పని చేసిన సమయంలోనూ..
లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంటుగా బాధ్యతలు తీసుకున్న ప్రస్తుత కమిటీలోనూ కీలక బాధ్యతల్లో సీనియర్ నేతలు యనమల, గోరంట్ల.

Tags; TDP’s New Executive Committee Swearing-in Ceremony, Administered by CM Chandrababu