April 29, 2026
Explore
ఒకటో తేదీ కి ముందే మొదలైన రేషన్ మాఫియా

ఒకటో తేదీ కి ముందే మొదలైన రేషన్ మాఫియా

April 29, 2026 | Andhra Pradesh

రేషన్ డిపోల నుండి పక్కదారి పట్టిన పేదల బియ్యం

రేషన్ డిపోల నుండి నేరుగా కోళ్ల ఫారాలకు తరలిపోతున్న వృద్ధుల బియ్యం

ఎన్టీఆర్ జిల్లా ముచ్చట్లు:

మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం

రేషన్ మాఫియా కు పాల్పడితే ఉపేక్షించేది లేదని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా రేషన్ డీలర్లు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నా కూడా వారి ఆదేశాలను
లెక్క చేయకుండా పేద మరియు వృద్ధుల బియ్యాన్ని పక్కదారి పట్టించడం లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

గత నెలలో ఇబ్రహీంపట్నం తహసిల్దార్ మండల పరిధిలోని రేషన్ డీలర్లతో ప్రత్యేక భేటీ నిర్వహించి ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని చెప్పినా కూడా రేషన్ డీలర్ల తీరు మార్చుకోకుండా సైలెంట్ గా తమ దందాను కొనసాగిస్తున్నారు అంటే ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు.

ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో ఉన్నటువంటి కోళ్ల ఫారాలకు రేషన్ బియ్యాన్ని తరలిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు

రేషన్ మాఫియా పై ఉక్కుపాదం మోపాల్సినటువంటి అధికారులు వారిపై శ్వేత కన్ను వేసి అడ్డగోలుగా దోచుకోమని సహకరిస్తున్నారని స్థానికుల వాదన. ఇదే విషయాన్ని అదునగా చూసుకొని రెచ్చిపోతున్న రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు అని తెలిసి కూడా తెలియనట్లే వ్యవహరిస్తున్న కొందరు అధికారులు వారి మాయాజాలంలో పడి లేదా నెలవారి మామూళ్లకు అలవాటు పడి న కొంత మంది అధికారులు వీరికి సహాయం చేస్తూ నెల నెలా మామూలు అందుకుంటూ ప్రజల నోట్లో మట్టి కొట్టడం ఇది కొత్తమి కాదు…

రేషన్ మాఫియా పై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కుపాదం మోపుతున్నా కూడా కొందరిలో మార్పు మాత్రం రాకపోవడం గమనార్హం.. అదే విధంగా ఇంకా ఇంకా రెచ్చిపోతూ ప్రజల పొట్ట కొడుతూ అక్రమ సంపాదనకు అలవాటు పడి పేద ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు.

ఒకటో తారీకు రాకముందే రేషన్ మాఫియా తో చేతులు కలిపి గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూన్నారు…

ఎంత వరకూ ఈ ఆగం….

కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుంటే వ్యవస్థ దారి తప్పుతున్న కూడా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి…….

ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పు రావాలని ప్రజలందరూ కోరుకుంటే కూడా కొందరు అవినీతి అధికారుల సహకారంతో ఇంత జరుగుతున్నా కూడా చోద్యం చూస్తూ ఉన్నారు…..

ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను చూసి కూడా చూడనట్లు వ్యవహరిస్తున్న కొందరు అవినీతి అధికారులపై స్పెషల్ స్టోరీ.

Tags: The Ration Mafia Strikes Before the First of the Month