April 26, 2026
Explore
తిరుమల టీటీడీ బోర్డు మెంబర్ నకిలీ సిఫార్సు

తిరుమల టీటీడీ బోర్డు మెంబర్ నకిలీ సిఫార్సు

April 26, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • తిరుమల టీటీడీ బోర్డు మెంబర్ నకిలీ సిఫార్సు లెటర్లతో దర్శనం పేరుతో మోసం – నిందితుడు అరెస్ట్.
  • తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు తిరుమల II టౌన్ పోలీసులు, శ్రీవారి ప్రత్యేక దర్శనం (Break Darshan) కల్పిస్తానని చెప్పి మోసం చేస్తున్న చాగంటి నవీన్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
  • ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన బాధితురాలు అనిత, తన కుటుంబ సభ్యులు 12 మందికి దర్శనం టిక్కెట్లు ఏర్పాటు చేయమని నిందితుడిని సంప్రదించగా, ఒక్కొక్కరికి ₹3,000 చొప్పున మొత్తం ₹36,000 వసూలు చేశాడు. అనంతరం నిందితుడు గూగుల్ ద్వారా TTD బోర్డు మెంబర్ సిఫార్సు లెటర్‌ను డౌన్‌లోడ్ చేసి, నకిలీ లెటర్లు తయారు చేసి WhatsApp ద్వారా పంపించాడు.
  • బాధితురాలు 24.10.2025న తిరుమలకు వెళ్లి అధికారులకు చూపగా అవి నకిలీవని గుర్తించారు. ఫిర్యాదు మేరకు తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
  • జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, , TTD CVSO మురళీకృష్ణ, ఐపీఎస్., గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం, నిందితుడిని 25.04.2026న తిరుమలలో అరెస్ట్ చేసింది. విచారణలో ₹36,000 వసూలు చేసి నకిలీ సిఫార్సు లెటర్లు పంపించినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడి వద్ద నుండి ఒక మొబైల్ ఫోన్, ₹36,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
  • ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి:
  • శ్రీవారి దర్శనం, సేవలు కేవలం అధికారిక మార్గాల ద్వారానే పొందాలి. సోషల్ మీడియా లేదా వ్యక్తుల ద్వారా వచ్చే హామీలను నమ్మి డబ్బులు చెల్లించకూడదు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు లేదా టీటీడీ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
  • జిల్లా ఎస్పీ గారు సందేశంఇస్తూ “శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. దర్శనం, వసతి పేరుతో మోసాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంచి చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాము” అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, తెలిపారు.

Tags:Fake Recommendation by TTD Board Member (Tirumala)