బి.కొత్తకోట ముచ్చట్లు:
బి.కొత్తకోట నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో కర్ణాటక సరిహద్దు ఉంది. గతంలో వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల నుంచి ఎర్రచందనం, కలప, ఇసుక, నిషేధిత కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని అటవీశాఖ, పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. బి.కొత్తకోట-బార్డర్ మధ్యలో మరువపల్లె క్రాస్ వద్ద అటవీశాఖ చెక్ పోస్టు, సరిహద్దుకు సమీపంలో బూచిపల్లి క్రాస్ వద్ద పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వీటిని కొన్నేళ్లుగా ఆ శాఖలో చెక్ పోస్టులను ఎత్తివేశాయి. దాంతో కర్ణాటక నుంచి ఆంధ్రాలోకి, ఆంధ్ర నుంచి కర్ణాటకలోకి నిషేధిత కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. వీటిపై కనీస తనిఖీలు ఉండడం లేదు. నిఘా పూర్తిగా లేదు. దీన్ని అడ్డుకట్ట వేసేందుకు చెక్ పోస్టులను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Tags: Set up checkpoints.