జేసీ ఉదయాన్నే పర్యటన
మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదివారం ఉదయం 5 గంటల నుంచే పర్యటించారు. కోమటివాని చెరువు, బహుదా నది, బస్టాండ్, కాలనీలు తదితర ప్రాంతాలను పరిశీలించి శుభ్రత పనులను సమీక్షించారు. పారిశుద్ధ కార్మికుల పనితీరును పరిశీలిస్తూ కాలువల్లోని చెత్తను పూర్తిగా తొలగించాలని, తీసిన మురుగును వెంటనే తరలించాలని సూచించారు. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని, ప్రజలు కూడా సహకరించాలని జేసీ పిలుపునిచ్చారు.
Tags: Special Focus on Sanitation in Madanapalle