వాల్మీకిపురం ముచ్చట్లు:
వాల్మీకిపురం మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. జమ్మలపల్లెకు చెందిన చంద్రారెడ్డి (59) బైక్‌పై బైపాస్ రోడ్డులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి డివైడర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Road Accident in Valmikipuram: Farmer Seriously Injured