April 26, 2026
Explore
డిస్టెన్స్ డిగ్రీలపై హైకోర్టు కీలక తీర్పు.. ప్రభుత్వ ఉద్యోగాలకు చెల్లవు

డిస్టెన్స్ డిగ్రీలపై హైకోర్టు కీలక తీర్పు.. ప్రభుత్వ ఉద్యోగాలకు చెల్లవు

April 26, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా పక్క రాష్ట్రాల వర్సిటీల స్టడీ సెంటర్లలో పొందిన డిగ్రీలు ప్రభుత్వ ఉద్యోగాలకు చెల్లవని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాలు తమ పరిధిని దాటి స్టడీ సెంటర్లు నిర్వహించడం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని కోర్టు తేల్చింది.

టీజీపీఎస్సీ లైబ్రేరియన్ పోస్టుల నియామకాల సందర్భంగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వర్సిటీ నుంచి తెలంగాణలోని స్టడీ సెంటర్ ద్వారా డిగ్రీలు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను టీజీపీఎస్సీ తిరస్కరించగా, వారు హైకోర్టును ఆశ్రయించారు.

విచారణలో కోర్టు, గతంలో ఇలాంటి డిగ్రీలను అంగీకరించినా అది సరైన కారణం కాదని, చట్టానికి విరుద్ధమైన విధానాలను సమర్థించలేమని పేర్కొంది. ఈ తీర్పుతో ఇలాంటి డిగ్రీలు కలిగిన అభ్యర్థుల భవిష్యత్తు అనిశ్చితంగా మారగా, రాబోయే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

Tags: High Court Delivers Key Verdict on Distance Education Degrees: Not Valid for Government Jobs