తిరుపతి ముచ్చట్లు:
- హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు.
- సైబర్ క్రైమ్స్, మహిళలపై నేరాలు, ఆస్తి సంబంధిత నేరాలపై అవగాహన.
- ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు మార్గదర్శనం.
- తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘాను పెంచుతూ, ప్రజలకు భద్రతాభావాన్ని కల్పించే చర్యలు చేపడుతున్నారు.
- ఇందులో భాగంగా గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్గ్ అపార్ట్‌మెంట్స్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలు, ఆస్తి సంబంధిత నేరాలు మరియు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు వివరణాత్మకంగా తెలియజేశారు. నేటి కాలంలో పెరుగుతున్న సైబర్ మోసాల నుండి ఎలా జాగ్రత్తపడాలి, అనుమానాస్పద పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలనే విషయాలను స్పష్టం చేశారు.
- అదేవిధంగా వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చని పోలీసులు సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని తెలియజేస్తూ, భద్రతకు సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు కోరారు.
Tags:Visible Policing Strengthened Across the District.