April 23, 2026
Explore
ఇది బాధ్యతగల తలిదండ్రుల విజయం…

ఇది బాధ్యతగల తలిదండ్రుల విజయం…

April 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి
జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదుల వెల్లువ
రాష్ట్ర ప్రభుత్వాలకు NHRC నోటీసులు
జాతీయ స్కూల్ బ్యాగ్ విధానం ప్రకారం..
చర్యలు తీసుకోవాలని ఆదేశం
ప్రైవేట్ స్కూళ్లపై నివేదిక అందించాలని ఆదేశం…PAAP

@ ​ప్రైవేట్ పాఠశాలల పుస్తకాల మాఫియాపై…

-​ప్రైవేట్ పాఠశాలలు కమీషన్ల కోసం అధిక ధరల పుస్తకాలను తల్లిదండ్రులపై రుద్దడంపై NHRC తీవ్రంగా స్పందించింది. ఇది విద్యా హక్కు చట్టం (RTE) మరియు మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

-​ముఖ్యమైన మార్గదర్శకాలు (School Bag Policy 2020):
@ ​పుస్తకాల ఎంపిక: ప్రాథమిక తరగతులకు కేవలం NCERT/SCERT పుస్తకాలను మాత్రమే వాడాలి. అదనపు ప్రైవేట్ పుస్తకాలను బలవంతం చేయకూడదు.
-​బ్యాగ్ బరువు: విద్యార్థి బరువులో 10% కంటే మించకూడదు.
-​హోం వర్క్: 2వ తరగతి వరకు విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వడం నిషేధం.
@ ​ప్రైవేట్ స్కూళ్లపై ఉన్న ప్రధాన ఆరోపణలు:
​నిర్ణీత దుకాణాల్లోనే వేల రూపాయల విలువైన పుస్తకాలు, యూనిఫాంలు కొనాలని ఒత్తిడి చేయడం.
​ప్రభుత్వ పుస్తకాల కంటే 3-4 రెట్లు అధిక ధరలు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం వేయడం.

@ ​తల్లిదండ్రులు ఏం చేయాలి?…
​మీ పాఠశాలలో ఇలాంటి ఒత్తిడి ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయండి:
​జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC):
​Email: covdnhrc@nic.in
​Helpline: 14433
​Website: hrcnet.nic.in

@ ​స్థానిక అధికారులు: మీ ప్రాంతంలోని MEO, DEO లేదా జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు.
-​గమనిక: నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలల గుర్తింపును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. మీ హక్కులను కాపాడుకోండి!

​ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP)
(రిజి.నెం.6/2022), ఆంధ్రప్రదేశ్ కమిటీ
ఫోన్: +91 63053 13558
ఈమెయిల్: parentsassociationap@gmail.com

Tags: This is the victory of responsible parents.