పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీలకు ఎంవి హెల్పింగ్‌హాండ్స్ సంస్థ వారు డిక్షనరీలు ప్రధానం చేశారు. గురువారం సంస్థ సభ్యులు మధుసూదన్‌రెడ్డి , వారి కుటుంబ సభ్యులు రూ.20 వేలు విలువ చేసే డిక్షనరీలను విద్యార్థినీలకు బహుమతులుగా పంపిణీ చేశారు. మృతి చెందిన రామిరెడ్డి, నారాయణమ్మ, కృష్ణారెడ్డిల జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గంగాధర్‌నాయుడు, కళాశాల కమిటి మెంబరు నాగరాజు, అధ్యాపకులు రాధాకృష్ణ, విజయకుమారి, భవాని తదితరులు పాల్గొన్నారు.
Tags: Dictionaries are essential for outstanding students.