April 23, 2026
Explore
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం..!

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం..!

April 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా చండీగఢ్ కు చెందిన జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి హాలులో ఆమె చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏప్రిల్ 24న CJ పదవీ విరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపడతారు. దీంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా చరిత్రకెక్కనున్నారు..!

ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ రిటైర్ అయ్యారు. దీంతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ లీసా గిల్తో సీజేగా ప్రమాణం చేయించనున్నారు. పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆమె ఇటీవల ఏపీకి బదిలీ అయిన విషయం తెలిసిందే…!

Tags: Justice Lisa Gill Sworn in as Judge of the AP High Court!