మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలంలో అమానుష ఘటన గురువారం వెలుగు చూసింది. మండలంలోని ఒక కాలనీలో కాపురం ఉంటున్న 10వ తరగతి చదివిన మైనర్ బాలిక పెళ్లి కాకుండానే గర్భం దాల్చి, గురువారం ఉదయం ప్రసవించడం తీవ్ర కలకలం రేపుతోంది. మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఎవరైనా మోసం చేశారా..? వేరే ఇతర కారణాలు ఉన్నాయా..? తెలియరావడం లేదు. ఇంత జరిగినా ఇప్పటి వరకు ఐసిడిఎస్ అధికారులకు కూడా సమాచారం లేకపోవడం గమనార్హం. ఆశ వర్కర్ లేకుండానే ప్రసవం జరగడంతో వారి పనితీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
Tags: Unmarried 10th-Grade Girl Gives Birth in Madanapalle