పుంగనూరు ముచ్చట్లు:
పోషణ పక్వాడ కార్యక్రమంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉంటుందని ఐసిడిఎస్ సూపర్‌వైజర్ సుగుణ తెలిపారు. బుధవారం మండలంలోని వనమలదిన్నె పంచాయతీ కొండమదొడ్డి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం నందు పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్యాక్ చేసిన జింక్‌ఫుడ్ పిల్లలకు అందించడం వలన కలిగే నష్టాలు , పిల్లలు వెహోబైల్ వాడటం వలన కలిగే అనర్థాల గురించి వివరించారు. 0 నుంచి 2 సంవత్సరముల లోపు పిల్లల వెహోదడు అభివృద్ధికి అత్యంత కీలకమని , పిల్లలకు ఆట ఆధారిత విద్య అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది, అంగన్‌వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags; A Healthy Future with Poshan Pakwada