పీలేరు ముచ్చట్లు:
ఉమ్మడి చిత్తూరు (తిరుపతి ) జిల్లా, పీలేరు నియోజకవర్గంలోని యర్రావారిపాలెం మండలం, కోటకాడపల్లి కి సమీపంలోని వ్యవసాయ పొలాల్లో రైతులు, వేటగాళ్లు కలసి కరెంటు తీసి వణ్య ప్రాణులను చంపేస్తున్నారు. నెల రోజుల క్రితం రెండు మదపుటేనుగులను కరెంటు తీసి చంపేసిన ఘటన మండలంలో మరువకనే.. మంగళవారం మరో ఘటన వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. కరెంటుతో వణ్య ప్రాణులను చంపేస్తున్నా అటవీ, విద్యుత్ శాఖ, ఇతర శాఖల అధికారుల్లో ఏ మాత్రం చలనం లేక పోవడం విశేషం. ఉన్నతాధికారుల పట్టింపులేనితనంతోనే వణ్య ప్రాణులు బలైపోతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మదనపల్లిలో చిరుత పులి, అడవి పందులు, తంబళ్లపల్లి నియోజకవర్గం లో జింకలు, శేషచల అడవుల్లో దుప్పులు, వాల్మీకి పురంలో అడవి పందులను వేటాడి చంపేసిన ఘటనలు ఉన్నాయి. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో వణ్య ప్రాణాలను కరెంటు తీసి యదేచ్చగా చంపి మాంసం విక్రయాలు చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…
Tags; Wildlife falls victim to poachers’ electric trap.