April 20, 2026
Explore
శ్రీమాణిక్య వరదరాజస్వామి పరుష వేలం రూ.1.49 లక్షలు ఆదాయం

శ్రీమాణిక్య వరదరాజస్వామి పరుష వేలం రూ.1.49 లక్షలు ఆదాయం

April 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయంలో ప్రతి ఏడాది నిర్వహించే ఆవుల పరుషకు సోమవారం వేలం పాట నిర్వహించారు. ఆలయ ఈవో , ఉప కమిషనర్‌ ఏకాబంరం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంపాటలో పట్టణానికి చెందిన గంగాధర్‌ రూ.1.49 లక్షలకు పాడి పాట దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ మాణిక్యవరదరాజస్వామి రథోత్సవానికి అనుబంధంగా ప్రతి ఏడాది ఆవుల పరుష నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పాటదారులు నిబంధనల మేరకు సక్రమంగా ఆవుల పరుష నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ శశికుమార్‌, ఆలయ సిబ్బంది లత, అర్చకులు కృష్ణ దీక్షితులు, పాటదారులు పాల్గొన్నారు.

Tags; Sri Manikya Varadaraja Swamy: Auction Yields Revenue of ₹1.49 Lakhs