April 20, 2026
Explore
250 కోట్లు భరణం కోరిన సంగీత

250 కోట్లు భరణం కోరిన సంగీత

April 20, 2026 | Andhra Pradesh

35 కోట్లు ఇస్తానంటున్న హీరో విజయ్

తమిళనాడు ముచ్చట్లు:

తమిళ వెట్రి కళగం పార్టీ అధినేత స్టార్ హీరో విజయ్ విడాకుల కేసు పెను సంచలనంగా మారింది. ఇవాళ కోర్టులో విజయ్ భార్య సంగీత 250 కోట్ల భరణం కోరారు. 35 కోట్లు ఇవ్వగలనని, కుమారుడు కుమార్తె బాగోగులు తానే చూసుకుంటానని విజయ్ కోర్టుకు తెలిపారు.

విజయ్ భార్య సంగీత తన 27 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. నటి త్రిష, విజయ్ సహ జీవనం చేస్తున్నారనేది ఆమె ఆరోపణ. వివాహేతర సంబంధం, శారీరక క్రూరత్వం కారణంగా ఆమె విడాకులు కోరినట్లు పేర్కొన్నారు.

తమిళనాడులో జరుగనున్న ఎన్నికల్లో టివికె పార్టీ విజయ్ నాయకత్వంలో బరిలో వుంది. తన డ్రైవర్ తోసహా అనేక మంది యువతకు సీట్లు కేటాయించి పోటీ చేయిస్తున్నారు. అయితే ఈ పార్టీ చీల్చే కొద్దిపాటి ఓట్లతో స్టాలిన్ కే మళ్ళీ గెలువు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది!

తమ కేసు ముగిసేంత వరకు తాను విజయ్ ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని సంగీత మరో పిటిషన్ వేశారు. గత రెండేళ్లుగా ఇద్దరూ విడివిడిగా వుంటున్నారు. పిల్లలు కూడా సంగీత దగ్గరే వుంటున్నారు. కాగా, ఎన్నికల్లో తనను ఓడించే టార్గెట్ గా ఆమె చర్యలు వుంటున్నాయని, తాను ముఖ్యమంత్రి కాకుండా కక్షతో సంగీత కుట్రలు పన్నుతున్నారని విజయ్ ఆరోపిస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో 605 కోట్లు ఆస్థులు ఉన్నట్లు విజయ్ పేర్కొన్నారు. భార్య సంగీత, ఇద్దరు పిల్లల పేరిట ఒక్క ఆస్థి కూడా లేకపోవడం విశేషం!

Tags: Sangeetha Demands ₹250 Crore Alimony