April 20, 2026
Explore
ఎపుడో చెప్పెను బ్రహ్మంగారు

ఎపుడో చెప్పెను బ్రహ్మంగారు

April 20, 2026 | Andhra Pradesh

పంది కడుపులో ఏనుగు పిల్ల

అమరావతిముచ్చట్లు:

పంది కడుపులో పందే పుడుతుందన్న వెటకారంగా చెప్పే మాటలు విన్నాం.. కానీ పంది కడుపులో అచ్చం ఏనుగు పిల్ల ఆకారంలో ఓ పంది పిల్ల పుడితే. ఇంకేముంటుంది అది ఓ వింత ఘటనే అవుతుంది. తొండం, భారీ చెవులతో ఓ పంది ఏనుగు ఆకారంలో ఉన్న పిల్లకు జన్మనివ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది
నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. పంది కడుపులో ఏనుగు పిల్ల ఆకారంలో పిల్ల జన్మించింది. పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో ఈ సంఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య అనే వ్యక్తి పందులను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ఇంటి ఆవరణలోనే ఓ చిన్న పందిరి వంటి నిర్మాణంలో పందులను పోషిస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నాడు. అయితే అందులో ఒక పంది మొదటి ఈతలో ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. మొదట సంతోషం వ్యక్తం చేసిన యజమాని తర్వాత ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఏడు పంది పిల్లల్లో ఒకటి అచ్చం ఏనుగు ఆకారాన్ని పోలి ఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు అంతలోనే కుటుంబ సభ్యులు, స్థానికులకు విషయం తెలిసిపోయింది. ఆనోట ఈనోట గ్రామస్థులు తెలియడంతో ఏనుగు ఆకారంలో ఉన్న పందిపిల్లను చూసేందుకు పెద్ద ఎత్తున వెంకటయ్య ఇంటికి తరలివచ్చారు. అచ్చం ఏనుగు పిల్ల ఆకారాన్ని పందిపిల్ల పోలి ఉండడం విశేషం. తొండం ఆకారం, భారీ చెవులతో చూడగానే ఏనుగు పిల్ల అనేలా కనిపిస్తోంది. అయితే జన్మించిన కాసేపటికే ఆ పంది పిల్లతో పాటు మరో పంది పిల్ల సైతం మరణించింది. ప్రస్తుతం ఐదు పందిపిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయి.

Tags: Brahmam garu foretold it long ago.