April 20, 2026
Explore
స్కూటర్లు చోరీ చేసే మోస్ట్ వాంటెడ్ దొంగ అరెస్ట్ : ఎస్పీ

స్కూటర్లు చోరీ చేసే మోస్ట్ వాంటెడ్ దొంగ అరెస్ట్ : ఎస్పీ

April 20, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

నడిపేది ఆటో.. చేసేది స్కూటర్ల దొంగతనం, ఆటో మాటున స్కూటర్లు దొంగలించే 20 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుపై జిల్లా ఎస్పీ ధీరజ్ సోమవారం మదనపల్లెలో తెలిపిన వివరాలు.. అన్నమయ్య జిల్లా, లక్కీరెడ్డిపల్లికి చెందిన మల్లికార్జున ఆటో నడుపుతూ, ఆటో మాటున బైక్ లు దొంగలుస్తూ మదనపల్లె పోలీసులకు పట్టుబడ్డా డన్నారు. నిందితుని వద్ద10 బైక్ లు సీజ్ చేసి అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డిఎస్పి పావని తదితరులు ఉన్నారు.

Tags: Most-Wanted Scooter Thief Arrested: SP