April 18, 2026
Explore
హెల్మెట్ తప్పనిసరి – బాపట్లలో కఠిన తనిఖీలు

హెల్మెట్ తప్పనిసరి – బాపట్లలో కఠిన తనిఖీలు

April 18, 2026 | Andhra Pradesh

జిల్లా రవాణా శాఖ అధికారి టి.కే పరందరామయ్య రెడ్డి

బాపట్ల ముచ్చట్లు:

బాపట్ల జిల్లాలో రోడ్డు భద్రత నిబంధనల అమలుపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె. పరంధామయ్య రెడ్డి ఆధ్వర్యంలో శనివారం బాపట్ల పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

పట్టణంలోని చిల్ రోడ్డు సెంటర్ వద్ద నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీలలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావు నేతృత్వంలో సిబ్బంది పాల్గొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమంలో భాగంగా ద్విచక్ర వాహనదారులపై ప్రత్యేక దృష్టి సారించి హెల్మెట్ ధరించడాన్ని కచ్చితంగా పరిశీలించారు.

హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు హెల్మెట్ ధరించడం అత్యంత అవసరమని తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

అదేవిధంగా వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులను కూడా పరిశీలిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ బి. కిషోర్ బాబు సహా ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Helmets Mandatory – Strict Checks in Bapatla