April 18, 2026
Explore
మెటాలో 8 వేల మందికి లేఆఫ్‌లు.. వచ్చే నెలలోనే ?

మెటాలో 8 వేల మందికి లేఆఫ్‌లు.. వచ్చే నెలలోనే ?

April 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా కంపెనీ భారీగా ఉద్యోగాల కోత విధించేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 20 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన సిబ్బందిలో తొలి విడతగా 10 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో దాదాపు 8 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో మరిన్ని లేఆఫ్‌లు ఉండనున్నట్లు సమాచారం.

Tags: Layoffs for 8,000 people at Meta… As early as next month?