అమరావతిముచ్చట్లు:
తుఫాన్ బాధితులకు మధ్యాహ్న భోజనం వడ్డించిన ఎమ్మెల్యే
నాగాయలంక మండలం సంగమేశ్వరంలోని ఆర్ణబ్ తుఫాన్ బాధితుల పునరావాస కేంద్రాన్ని బుధవారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. బాధితులను పరామర్శించి, వారికి అందుతున్న సౌకర్యాలు పరిశీలించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందన్నారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. తుఫాన్ తీరం దాటినా, ప్రభావిత వర్షాల ముప్పు తప్పే వరకూ అధికారుల సూచనలకు అనుగుణంగా బాధితులు శిబిరాల్లోనే ఉండాలని సూచించారు. శిబిరాల్లో బాధితులకు ఎలాంటి లోటు లేకుండా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. శిబిరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిబ్బందికి సూచించారు. బాధితుల కోసం సిద్దమైన మధ్యాహ్న భోజనం వారికి వడ్డించారు.
Tags:MLA inspects Sangameswaram rehabilitation camp