April 18, 2026
Explore
స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమం

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమం

April 18, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ల పరిసరాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా పోలీసులు.
  • తిరుపతి, ఏప్రిల్ 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శనివారం తిరుపతి జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛత కార్యక్రమాలను పోలీసులు చేపట్టారు.
  • ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది తమ తమ పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాల పరిసరాలను శుభ్రపరిచి పరిశుభ్ర వాతావరణాన్ని కల్పించారు. స్టేషన్ ఆవరణలో ఉన్న చెత్తాచెదారాలను తొలగించడం, డ్రైనేజీ కాలువలను శుభ్రపరచడం, పిచ్చిమొక్కలను తొలగించడం వంటి చర్యలు చేపట్టారు. అదనంగా పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో మొక్కలు నాటారు.
  • ఈ స్వచ్ఛత కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని ఈ సందర్భంగా సూచించారు.

Tags: Swachh Andhra – Swarna Andhra’ Program