April 18, 2026
Explore
అమ్మాయిల కోసం బైక్ స్టంట్స్.. షాకిచ్చిన పోలీసులు

అమ్మాయిల కోసం బైక్ స్టంట్స్.. షాకిచ్చిన పోలీసులు

April 18, 2026 | Andhra Pradesh

కృష్ణా ముచ్చట్లు:

అమ్మాయిలను ఇంప్రెస్ చేయబోయి ఓ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. తన బైక్తో హైవేపై ప్రమాదకరంగా వీలీ చేస్తూ, బస్సులోని యువతులను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. మూవీ సీన్ లెవెల్లో ఉన్న ఈ స్టంట్ వీడియోను SMలో పోస్ట్ చేయగా అది కాస్తా కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసుల కంట పడింది. అతివేగం, ప్రమాదకరంగా స్టంట్స్ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. SMలో క్రేజ్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు.

Tags:Bike Stunts for Girls… Police Deliver a Shock