-11 మందిపై కేసు నమోదు
పుంగనూరుముచ్చట్లు:
జగనన్న కాలనీ, టిడ్కో గృహాల వద్ద మంచినీటి సమస్య, పారిశుద్ధ్య కార్యక్రమాలు అధ్వాన్నంగా ఉందని , అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోని కారణంగా నీటి కోసం రెండు కుటుంభాలు ఘర్షణ పడ్డారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై 11 మందిపై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ వెంకటేష్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గూడూరుపల్లె సమీపంలో జగనన్న కాలనీలో సుమారు 700 కుటుంభాలు నివాసం ఉన్నాయి. దీని ప్రక్కనే ఉన్న టిడ్కో గృహాల్లో 1136 కుటుంభాలు నివాసం ఉన్నారు. వీరికి సరిపడ మంచినీరు సరఫరా చేయడంలో అధికారులు గత ఆరు నెలలుగా నిర్లక్షం చేయడంతో ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు కూడ చేశారు. కానీ మార్పు రాలేదు. ఇలా ఉండగా మంచినీటి కోసం ముభారక్, నజియ కుటుంబం వారు మురళికృష్ణ, లావణ్యలతో ఘర్షణ పడ్డారు.ఈ ఘర్షణ గాలివాన లాగా తీవ్రమైంది. ముభారక్, నజియ కలసి తమకు అనుకూలమైన బయటవ్యక్తులను పిలిపించి మురళికృష్ణ, లావణ్య కుటుంబంపై దాడి చేసి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముభారక్, నజియతో పాటు మరో 9 మందిపైన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. ఇకనైన అధికారులు స్పందించి, జగనన్న కాలనీ, టిడ్కో గృహాలకు మంచినీరు అందిస్తారా…లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
Tags: Clash over water in Jagananna Colony