రాజంపేట ముచ్చట్లు:
రాజంపేటలో రెవెన్యూ భూ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ నిధియా మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన, అలాగే తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అధికారులు ప్రజల నుంచి భూ సంబంధిత సమస్యలపై అర్జీలు స్వీకరించి, వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సమస్యల స్వభావాన్ని బట్టి సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని పలు ఆదేశాలు జారీ చేశారు.
భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో పెద్ద ఎత్తున ప్రజలు కార్యక్రమానికి హాజరై తమ వినతిపత్రాలను సమర్పించి, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
Tags: Platform for resolving revenue land issues launched in Rajampet.