July 17, 2026
Explore
జూలై 20 నుంచి 27 వరకు మీసిల్స్ టీకా డ్రైవ్

జూలై 20 నుంచి 27 వరకు మీసిల్స్ టీకా డ్రైవ్

July 17, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో జూలై 20 నుంచి 27 వరకు మీసిల్స్– రూబెల్లా (ఎంఆర్) ప్రత్యేక టీకా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య తెలిపారు. 9–12 నెలల పిల్లలకు తొలి డోస్, 16–24 నెలల పిల్లలకు రెండో డోస్ తప్పనిసరిగా వేయించాలని సూచించారు. టీకాలు వేయించుకోని ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి ఇంటింటా సర్వే నిర్వహించి టీకాలు అందజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని పిల్లలను ప్రమాదకరమైన మీసిల్స్, రూబెల్లా వ్యాధుల నుంచి రక్షించాలని ఆయన కోరారు.

Tags: Measles vaccination drive from July 20 to 27