పల్నాడు ముచ్చట్లు:
పల్నాడు జిల్లాలో జనగణన కార్యక్రమం ప్రారంభం అయిన నేపధ్ధ్యం లో భాగంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్వీయ జనగణన ద్వారా తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. se.census.gov.in వెబ్ సైట్ ద్వారా వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను అందరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు . ఈ నెల 30 తేదీ వరకూ ప్రజలు స్వయంగా ఆన్ లైన్ లో తమ ఇళ్లకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
Tags: Registering one’s details for the census through the online portal.