April 17, 2026
Explore
4 ఏళ్ల పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం.

4 ఏళ్ల పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం.

April 17, 2026 | Andhra Pradesh

. చాక్లెట్ తినిపిస్తానని ఏం చేసిందో చూడండి..

హైదరాబాద్‌ ముచ్చట్లు:

హైదరాబాద్‌ బోడుప్పల్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. అత్తమామలు తన బిడ్డను సరిగ్గా పట్టించుకోవడంలేదన్న కోపంతో అమ్మలా ప్రేమను పంచాల్సిన పిన్ని.. తోటి కోడలి కుమారుడికి చాక్లెట్ ఆశచూపి యాసిడ్‌ తాగించింది. యాసిడ్ నోట్లో పడగానే బాలుడి కేకలు విన్న కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.

పిన్ని అంటే తల్లి తర్వాత తల్లిలాంటిది. కానీ ఇక్కడో మహిళ ఆ పదానికే అర్థం లేకుండా చేసింది. అమ్మలా ప్రేమించాల్సింది పోయి చిన్నారిని చంపేందుకు ప్రయత్నించింది. అత్తా మామలు తన పిల్లలను పట్టించుకోవడం లేదని అసూయ పడిన ఆమె తన తోటి కోడలి కుమారుడికి చాక్లెట్ ఇప్పిస్తానని ఆశచూపి నోట్లో యాసిడ్ పోసింది. హైదరాబాద్‌లోని బోడుప్పల్ జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు పట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి సమీపంలోని బోడుప్పల్ ద్వారాకా నగర్‌కు చెందిన మంజూల అనే మహిళ ఫ్యామితీలో కలిసి ఉంటుంది. అయితే అత్తా, మామలు పెద్ద కొడుకు, కోడలు, వాళ్ళ పిల్లలను బాగా చూసుకుంటూ తన కొడుకును ఇంట్లో సరిగా పట్టించుకోవడం లేదు అనే కారణంతో మంజూల తన తోటి కోడలి నాలుగేళ్ల కుమారుడిపై దారుణానికి ఒడిగట్టింది. జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి బాలుడికి యాసిడ్ తాగించినట్టు తెలుస్తోంది.

యాసిడ్‌ నోట్లో పడడంతో ఒక్కసారిగా బాలుడు కేకలు వేశాడు. కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అది గమనించిన తల్లిదండ్రులు బాలుడిని వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. అయితే ఇప్పుడే కాదు గతంలోనూ తన కుమారుడిపై తోటి కోడలు మంజులా హత్యాయత్నం చేసిందని బాలుడి తల్లి సంధ్య ఆరోపించింది. కానీ మంజూల మాత్రం తాను యాసిడ్‌ తాగించలేదని.. పిల్లాడి చేతిలో యాసిడ్‌ బాటిల్‌ను చూసి లాగేశానని చెబుతోంది. ఇక ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Aunt’s Atrocity Against a 4-Year-Old Child.