April 17, 2026
Explore
మహిషాసుర మర్దినిగా శ్రీవిరూపాక్షి మారెమ్మ

మహిషాసుర మర్దినిగా శ్రీవిరూపాక్షి మారెమ్మ

April 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని బస్టాండు వద్ద గల శ్రీవిరూపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించి పూజలు చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, అమ్మవారికి పూజలు చేసి, గుమ్మిడికాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు కట్టి దిష్టి , గ్రహదోష నివారణ పూజలు నిర్వహించారు. అలాగే అమ్మవారికి నెయ్యితో దీపాలు వెలిగించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Sri Virupakshi Maremma as Mahishasura Mardini