July 16, 2026
Explore
బోయకొండ భక్తుల ఆటోను ఢీకొన్న ఆర్టీసి

బోయకొండ భక్తుల ఆటోను ఢీకొన్న ఆర్టీసి

July 16, 2026 | Andhra Pradesh

5 మందికి గాయాలు

పుంగనూరుముచ్చట్లు:

బోయకొండ గంగమ్మను దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్న భక్తుల ఆటోను ఆర్టీసి బస్సు మండలంలోని కృష్ణాపురం వద్ద ఢీకొనగా 5 మంది భక్తులు గాయపడిన సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మదనపల్లెకి చెందిన ఐదుమంది ఆటోలో బోయకొండకు వెళ్లి తిరిగి మదనపల్లెకి వెళ్తుండగా కృష్ణాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడి, అందులో ప్రయాణిస్తున్న 5 మంది సతీష్‌, కుమార్‌, మల్లికార్జున తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు గమనించి బాధితులను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: RTC bus rams into auto carrying Boyakonda devotees.