April 16, 2026
Explore
అగ్నిప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి

అగ్నిప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి

April 16, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ప్రస్తుత వేసవికాలంలో అగ్నిప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ సురేష్‌బాబు అన్నారు. గురువారం ఆయన భగత్‌సింగ్‌ కాలనీ నందు గల ప్రజలకు, పెట్రోల్‌ బంకుల్లో అవగాహన సదస్సులు నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. పెట్రోల్‌, డీజల్‌ పట్టే సమయంలో సిగరేట్లు, బీడిలు కాల్చడం , సెల్‌ఫోన్‌తో మాట్లాడటం చేయరాదన్నారు. అలాగే గ్యాస్‌ను మంటలు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉంచాలన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సుబ్రమణ్యం, లక్ష్మీనారాయణ, ప్రసాద్‌, వెంకట్రమణ, కేశవ, వినోద్‌కుమార్‌, మోహన్‌బాబు, ప్రకాష్‌, ఆనంద తదితరులు పాల్గొన్నారు.

Tags: Precautions must be taken to prevent fire accidents.