పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఎంసివి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరచినట్లు కరస్పాండెంట్ వెంకటసుబ్బయ్య తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో ఎం.మిస్భా ఎంపిసి విభాగంలో 979 , సి.చందు బైపిసి నందు 982, హెచ్.భానుశ్రీ సీఈసి నందు 856 మార్కులు సాధించారు. అలాగే ప్రథమ సంవత్సరంలో పి.వనిత బైపినందు 417 మార్కులు, ఉష్ణకౌసర్ బైపిసి 417, బి.చందన ఎంపిసి నందు 445, జి.ఇందు సిఈసి నందు 474 మార్కులు సాధించినట్లు తెలిపారు. వీరి ప్రతిభ పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు , కళాశాల చైర్మన్ రామకృష్ణ లు అభినందనలు తెలిపారు.\
Tags; The Talent of MCV Junior College Students