పుంగనూరుముచ్చట్లు:
వేసవి ఎండలు ముదురుతున్నందున ఆరోగ్యం పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అర్భన్ పిహెచ్‌సి డాక్టర్ కిరణ్మియి తెలిపారు. గురువారం ఆమె మేలుపట్ల గిరిజన బాలికల వసతిగృహం నందు విద్యార్థులతో సమావేశం నిర్వహించి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత, హ్యాండ్‌వాష్, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Tags; One should be vigilant about their health.