రాష్ట్రంలోని 163 ఆదర్శ పాఠశాలల్లో ఖ్యాతిప్రియ టాపర్
- రాష్ట్ర ర్యాంకు సాధించిన విద్యార్థినికి సన్మానం
పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమస్థానంలో నిలిచి , టాపర్‌గా నిలిచిన ఖ్యాతిప్రియాను గురువారం మోడల్‌స్కూల్ ప్రిన్సిపల్ రమ ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. మండలంలోని అడవినాథునికుంటలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న ఖ్యాతిప్రియ వ్యవసాయ కుటుంబంలో జన్మించింది. పెద్దపంజాణి మండలం ముత్తుకూరుకు చెందిన మల్లికార్జున, అమరావతి దంపతుల రెండవ కుమారై ఖ్యాతిప్రియ మోడల్‌స్కూల్‌లో సీఈసీ చదువుతూ 491 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోకెళ్ల పుంగనూరు ఆదర్శ పాఠశాలకు చెందిన ఖ్యాతిప్రియ పుంగనూరు ఆదర్శ పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిందని కొనియాడారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. కాగా విద్యార్థినీ తండ్రి గతంలో మరణించాడు. తల్లి పోషణలో ఖ్యాతిప్రియ పట్టుదలతో చదువులను కొనసాగిస్తోంది. ఈమెకు అక్క, తమ్ముడు ఉన్నారు.

Tags: Fame for an Ideal