April 16, 2026
Explore
రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు.

రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు.

April 16, 2026 | Andhra Pradesh

. స్పాట్‌లోనే 8 మంది మృతి

కర్నూలు ముచ్చట్లు:

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వస్తున్న బొలేరో వాహనం మంత్రాలయం మండలం చిలకలడోన దగ్గర సిమెంట్ కంకర ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 8 మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు.

భక్తులతో వెళ్తున్న ఓ బొలేరో వాహనం మంత్రాలయం సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొట్టి 8 మంది భక్తులు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. వీళ్లంతా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా మరో పదినిమిషాల్లో అంతా ఆలయానికి చేరతారనగా సరిగ్గా చిలకలడోన దగ్గర సిమెంట్ కంకర ట్యాంకర్‌ను ఢీకొట్టింది. లారీ బలంగా ఢీకొట్టడంతో బొలేరో వ్యాన్‌లో ఉన్న వారిలో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు.

మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. 3 సంవత్సరాల బాలికతోపాటు వ్యాన్‌ డ్రైవర్‌ కూడా స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌లకు తరలించారు.

అనంతరం వాహనంలో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. గాయపడ్డ వాళ్లలో కొందరికి సీరియస్‌గా ఉండడంతో వాళ్లను కర్నూలుకి షిఫ్ట్‌ చేసే అవకాశం ఉంది.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు మృతులంతా కర్నాటక వాసులుగా గుర్తించారు.

Tags: Death Stalks Devotee on the Way to Raghavendra Swamy’s Darshan.