పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి లు కలసి ముస్లింలకు ఈనెల 14న ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. గురువారం మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా విలేకరులతో మాట్లాడుతూ ప్రతియేటా నిర్వహించే రీతిలో పట్టణంలోని 28 మసీదులకు చెందిన ముస్లిం సోదరులకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి చే ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు తెలిపారు. అంజుమన్‌షాదీమహల్‌లో నిర్వహించే ఇఫ్తార్‌విందుకు ప్రతి ఒక్కరు హాజరై జయప్రదం చేయాలని కోరారు.
Tags: Iftar for Muslims by MLA and MP on 14th