పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్‌లో బుధవారం అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా అగ్నిమాపక విన్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఇన్‌చార్జ్ ఫైర్ ఆఫీసర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. ఫైర్ ౖసిబ్బంధి అంబేద్కర్ సర్కిల్‌లో విన్యాసాలు ప్రదర్శించి, ప్రజలకు అగ్నిప్రమాదాలు జరిగిన సమయంలో తగిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఎక్కడైన అగ్నిప్రమాదం సంభవిస్తే 101 కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Firefighting Demonstrations Captivate the Audience