అరుణాచల్ ప్రదేశ్ ముచ్చట్లు:
అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ చైనా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ ప్రాంతాన్ని తాము ‘జాంగ్నాన్’ అని పిలుస్తామని, భారత్ చెబుతున్న అరుణాచల్ను తాము ఎన్నడూ గుర్తించలేదని చైనా ప్రతినిధి గువో జియాకున్ మంగళవారం స్పష్టం చేశారు. అయితే, చైనా వ్యవహార శైలిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఒకవైపు సంబంధాలు మెరుగుపరుచుకుంటామని చెబుతూనే, మరోవైపు మన భూభాగాలకు ఇష్టం వచ్చినట్లుగా ఊహాజనిత పేర్లు పెట్టడాన్ని ప్రతినిధి రణ్ ధీర్ జయస్వాల్ తప్పుబట్టారు.
Tags: China Once Again Displays Malicious Intent Towards Arunachal