April 15, 2026
Explore
మానవత్వాన్ని చాటిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి

మానవత్వాన్ని చాటిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి

April 15, 2026 | Uncategorized

సోమల ముచ్చట్లు:

సోమల మండలం సమీపంలో జరిగిన ప్రమాద ఘటనలో పుంగనూరుకు చెందిన వ్యక్తులు బండి అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ఘటనను గమనించిన తంబళ్లపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వెంటనే స్పందించి, గాయపడిన వారిని తన సొంత వాహనంలోనే పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలుస్తూ, మానవత్వాన్ని చాటిన ద్వారకానాథ్ రెడ్డి సేవాభావం ప్రశంసనీయం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు రావడం ఆయన నాయకత్వ లక్షణాలను మరోసారి నిరూపించింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఆయనపై మరింత గౌరవాన్ని వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలియజేస్తున్నారు.

Tags: Peddireddy Dwarakanath Reddy: A Beacon of Humanity