ఏలూరు ముచ్చట్లు:
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై, ‘వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు’ పొగడ్తల వర్షం..!
చింతమనేనిని మంత్రిగా చూడాలని ఉందన్న ఎమ్మెల్సీ రవీంద్రబాబు..!
దెందులూరు మండలం, కొవ్వలి ప్రభుత్వ పాఠశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ఎమ్మెల్యే చింతమనేనితో కలిసి ‘వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు’ నివాళులర్పించారు..!
ఈ సందర్భంగా, వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచే చింతమనేని ప్రభాకర్‌ను మంత్రిగా చూడటం ఎంతోమంది కోరిక అని ‘వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు’ అన్నారు..!
Tags: An Interesting Development in the Denduluru Constituency!