– టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్‌మోహన్‌రాజు
రాజంపేటముచ్చట్లు:
రాజంపేటలో టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్‌మోహన్‌రాజు మాట్లాడారు. చంద్రబాబు నాయుడిపై వైసీపీ చేసిన అసత్య ప్రచారాలపై ధర్మాసనం తీర్పుతో సత్యం గెలిచి మూడేళ్లు పూర్తయ్యాయని అన్నారు. ప్రజాస్వామ్యం లో కక్షపూరిత రాజకీయాలకు చోటు లేదని, 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన సమాధానం చెప్పారని పేర్కొన్నారు.రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.వైసీపీ ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని జగన్‌మోహన్‌రాజు హెచ్చరించారు.
Tags: Three years since truth triumphed over falsehood.