చెర్లోపల్లి ముచ్చట్లు:
Gutti పట్టణంలోని చెర్లోపల్లి కాలనీకి చెందిన మునిస్వామి కుమార్తె హేమ(20) కాల్వగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తెలిపిన మేరక వివరాలు ఇలా ఉన్నాయి. హేమ కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా నయం కాలేదు. ఇటీవల హేమకు పెళ్లి ఖాయమైంది. దసరాకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అంతలోనే ఘోరం జరిగిపోయిందని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మునిస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Tags: Young woman commits suicide by jumping in front of a train.