ఉత్తర బెంగాల్ ముచ్చట్లు:
ఎస్పీజీ భద్రతను దాటి వెళ్లి వధూవరులకు ప్రధాని మోదీ క్షమాపణ..!
ఉత్తర బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్ ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఏప్రిల్ 12న సిలిగుడికి వెళ్లారు.. అక్కడ ప్రధాని మోదీ రాత్రి బస కోసం ఓ రిసార్ట్‌లో ఏర్పాట్లు చేశారు.
ఉత్తర బెంగాల్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త కుమారుడి వివాహం అదే రిసార్ట్‌లో జరుగుతోంది..!
ప్రధాని భద్రత దృష్ట్యా, ఎక్కడికక్కడ కదలికలపై ఆంక్షలు విధించడంతో రిసార్ట్ పరిసరాల్లో కొంత అసౌకర్యం నెలకొంది..!
ఈ పరిస్థితిని గమనించిన ప్రధాని మోదీ, వారి దగ్గరకు వెళ్లి.. ‘నా వల్ల మీకు చాలా ఇబ్బంది కలిగింది.. దయచేసి క్షమించండి..!’ అని తెలిపి, అనంతరం ప్రధాని మోదీ నూతన వధూవరులను ఆశీర్వదించారు..!
Tags: An interesting development in PM Modi’s election campaign in Siliguri!