April 15, 2026
Explore
పోలీస్ వాహనం దూసుకురావడంతో ASI మృతి, డ్రైవర్ పరారీ

పోలీస్ వాహనం దూసుకురావడంతో ASI మృతి, డ్రైవర్ పరారీ

April 15, 2026 | Uncategorized

సంగారెడ్డి ముచ్చట్లు:

సంగారెడ్డిలో ఘోర విషాదం నెలకొంది. విధుల్లో ఉన్న ఏఎస్ఐపైకి పోలీస్ వాహనం దూసుకెళ్లింది. దీంతో ఆ ఏఎస్సై తీవ్రంగా గాయాలపాలయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అయితే ఆ పోలీస్ వాహనాన్ని ఓ హోంగార్డు డ్రైవ్ చేయగా.. ఈ ఘటన తర్వాత అతడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో పరారీలో ఉన్న హోంగార్డును పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

ప్రజలను కాపాడే పోలీసును.. ఆ పోలీస్ శాఖ వాహనమే బలి తీసుకోవడం సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. మానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీస్ వాహనం ఢీకొట్టడంతో ఏఎస్ఐ గోవింద్ నాయక్‌ ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో హోంగార్డు రామారావు పోలీస్ వాహనాన్ని నడుపుతున్నాడు. ఏఎస్సైని ఢీకొట్టిన తర్వాత హోంగార్డు రామారావు పరారీ కావడం గమనార్హం.

విధి నిర్వహణలో భాగంగా మానూరు పోలీస్ స్టేషన్ ముందు ఏఎస్ఐ గోవింద్ నాయక్ ఉండగా.. పోలీస్ వాహనం ఒక్కసారిగా ఆయనపైకి దూకువచ్చింది. ఆ వాహనాన్ని హోంగార్డు రామారావు నడుపుతుండగా.. దానిపై అతడు కంట్రోల్ కోల్పోవడంతో అది ఒక్కసారిగా దూసుకెళ్లి గోవింద్ నాయక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏఎస్ఐ గోవింద్ నాయక్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన తోటి పోలీస్ సిబ్బంది.. ఏఎస్ఐ గోవింద్ నాయక్‌ను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే అతడికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక ఈ ఘోర ప్రమాదానికి కారణమైన హోంగార్డు రామారావు మాత్రం.. యాక్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారీ అయ్యాడు. దీంతో పారిపోయిన హోంగార్డు రామారావు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. గాలింపును చేపట్టారు. అయితే.. హోంగార్డు రామారావు.. కావాలనే ఏఎస్ఐ గోవింద్ నాయక్ పైకి పాత కక్షలను మనసులో పెట్టుకుని వాహనాన్ని ఎక్కించి చంపేశాడని బాధితుడి కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి.

ఏఎస్ఐ గోవింద్ నాయక్.. ప్రమాదంలో మృతి చెందడం, కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలతో పోలీస్ శాఖలో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ ఉన్నతాధికారిపై కింది స్థాయి సిబ్బంది.. ఇలా యాక్సిడెంట్ చేసి పరారీ కావడం ఇప్పుడు తీవ్ర దుమారానికి కారణం అయింది. విధుల్లో భాగంగా ఏఎస్ఐపై కక్ష పెట్టుకునే ఇలా చేశాడని కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి.. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు.

Tags: ASI Dies After Being Struck by Speeding Police Vehicle; Driver Absconding