April 14, 2026
Explore
మదనపల్లెలో కిలో టమాటా రూ.28

మదనపల్లెలో కిలో టమాటా రూ.28

April 14, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె స్థానిక టమాటా మార్కెట్లో కిలో టమాటా ధర రూ.28గా నమోదైంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు సుమారు 174 మెట్రిక్ టన్నుల టమాటాలను మార్కెట్‌కు తీసుకువచ్చారు.

స్థానిక వ్యాపారులు మొదటి రకం టమాటా 10 కిలోల బాక్స్‌ను రూ.280కి కొనుగోలు చేశారు. రెండవ రకం టమాటాలు రూ.210కి, మూడవ రకం టమాటాలు రూ.190కి అమ్ముడయ్యాయి. టమాటా ధరలు పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags: A kilo of tomatoes costs Rs. 28 in Madanapalle.