రామాపురం ముచ్చట్లు:
రామాపురం మండలంలోని పప్పిరెడ్డిగారిపల్లెలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నేత పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 17వ తేదీ వరకు సభ్యత్వ నమోదుకు అవకాశం ఉందని తెలిపారు. నియోజకవర్గంలో 5 వేల మందిని పార్టీ సభ్యులుగా చేర్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags: Jana Sena membership registration till 17th