April 14, 2026
Explore
డిప్యూటీ తహసీల్దార్లకు వివిధ అంశాలపై శిక్షణ

డిప్యూటీ తహసీల్దార్లకు వివిధ అంశాలపై శిక్షణ

April 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డిప్యూటీ తహసీల్దార్లుగా నియమితులైన వారు వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వ విభాగాల్లో శిక్షణ తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కలెక్టరేట్, జిల్లా సర్వే డైరెక్టర్ కార్యాలయాలతో పాటు గ్రామాలకు వెళ్లి వీఆస్ఏ, వీఆర్వోల వద్ద నాలుగు వారాలు పనిచేయాలి. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయం, పోలీసు శిక్షణకు సంబంధించి సీఐ కార్యాలయం, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో వద్ద శిక్షణ తీసుకోవాలి. జడ్పీసీఈవో, జలవనరులు, సహకార, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖలతో పాటు ఆరోగ్య కేంద్రం, ఏపీహెస్ఆర్డీఐ, సీసీఎల్లో శిక్షణ పొందాలి. మొత్తం 61 వారాల పాటు వివిధ ప్రభుత్వ విభాగాల్లో శిక్షణను నిర్దేశిస్తూ సీఎస్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.

Tags:Training for Deputy Tahsildars on Various Topics