March 12, 2026
Explore
ఉగాదిలోపు గృహప్రవేశం చేయకుంటే ఇళ్లు రద్దు

ఉగాదిలోపు గృహప్రవేశం చేయకుంటే ఇళ్లు రద్దు

March 12, 2026 | Andhra Pradesh

కలికిరి ముచ్చట్లు:

కలికిరి మండలంలో మంజూరైన ఇళ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయని పక్షంలో వాటిని రద్దు చేస్తామని గృహనిర్మాణ శాఖ పీడీ రమేష్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు అన్ని పనులు పూర్తి చేసుకుని ఉగాది పండుగ నాటికి గృహప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భానుమూర్తి రావు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.

Tags: If the house is not entered before Ugadi, the house will be cancelled.