మదనపల్లి ముచ్చట్లు:
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేశారని రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం. రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం. రవికుమార్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడుస్తూ పోలీసు సిబ్బంది విధుల్లో పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్.ఎస్.ఐలు అమరనాథ్ రెడ్డి, రవి, చంద్రశేఖర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Tags:Let us honor Ambedkar’s ideals.